కరోనా: కర్ణాటకలో 453.. కేరళలో 133 కొత్త కేసులు

కర్ణాటకలో గడిచిన 24 గంటల వ్యధిలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,150కి చేరుకుంది. కేరళలో అదివారం కొత్తగా 133 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా:  కర్ణాటకలో 453.. కేరళలో 133 కొత్త కేసులు
Follow us

|

Updated on: Jun 21, 2020 | 8:43 PM

కరోనా విలయతాండవానికి దక్షిణాది రాష్ట్రాలు అల్లడిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులతో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతుండగా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కర్ణాటకలో గడిచిన 24 గంటల వ్యధిలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,150కి చేరుకుంది. అదివారం కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలొదిలారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 137 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని ఆదివారం 225 మంది ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ 5,618 డిశ్చార్జ్ అయ్యారని కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కోంది. ఇక కరోనా బారినపడ్డ 3,391 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అటు కేరళలో అదివారం కొత్తగా 133 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,659 రికవరీ కాగా… 1,490 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.