కర్ణాటకలో ఓలాకు భారీ షాక్

ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలాకు కర్ణాటకలో భారీ షాక్ తగిలింది. ఓలా ట్యాక్సీలు, ఆటోలపై ఆరునెలల పాటు నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఉండగా.. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలను నడుపుతున్నారు. దీంతో ఓలాకు రవాణాశాఖ గతంలో […]

కర్ణాటకలో ఓలాకు భారీ షాక్
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 12:21 PM

ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలాకు కర్ణాటకలో భారీ షాక్ తగిలింది. ఓలా ట్యాక్సీలు, ఆటోలపై ఆరునెలల పాటు నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఉండగా.. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలను నడుపుతున్నారు. దీంతో ఓలాకు రవాణాశాఖ గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటికి స్పందించిన సంస్థ.. ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని వివరణ ఇచ్చింది. అయితే ఈ వివరణ అసంపూర్ణంగా ఉండటంతో ఓలాపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్‌ చేస్తూ.. ట్యాక్సీలు, ఆటోలు నడపకూడదని పేర్కొంది.

మరోవైపు రవాణా శాఖ నిర్ణయంపై ఓలా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరం. చట్టాలకు అనుగుణంగానే ఓలా వ్యవహరిస్తుంది. ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.