అక్కడ ప్రతి ఆదివారం లాక్ డౌన్..!

కర్నాటకలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి ఇది అమలులోకి రానుంది. అయితే, లాక్‌డౌన్ అమలు సమయంలో కేవలం నిత్యావసరాలు విక్రయించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇతర దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించనివారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అక్కడ ప్రతి ఆదివారం లాక్ డౌన్..!
Follow us

|

Updated on: Jun 28, 2020 | 9:43 PM

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న వేళ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి ఇది అమలులోకి రానుంది. అయితే, లాక్‌డౌన్ అమలు సమయంలో కేవలం నిత్యావసరాలు విక్రయించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇతర దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించనివారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే నైట్ కర్ఫ్యూ సమయాల్లో కూడా మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు ఉంది. జూన్ 29వ తేదీ నుంచి ఒక గంట మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యధావిధగా రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించింది.