అక్కడ ఆదివారం లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక రాష్ట్రం గత ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించింది. గత ఆదివారం పూర్తిగా రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు అన్ని మూసేసింది. అయితే ప్రజలు ఈ ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని సామాజిక మాద్యమాలు, ఇతర మార్గాలలో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో ఎక్కవ మంది ప్రజలు ఈ విదానాన్ని వద్దని అభ్యర్థించడంతో ఈ ఆదివారం నుంచి ప్రతి రోజు లాగానే లాక్‌డౌన్‌ నిభందనలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎం […]

అక్కడ ఆదివారం లాక్‌డౌన్‌ ఎత్తివేత..!
Follow us

|

Updated on: May 30, 2020 | 8:03 PM

కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక రాష్ట్రం గత ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించింది. గత ఆదివారం పూర్తిగా రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు అన్ని మూసేసింది. అయితే ప్రజలు ఈ ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని సామాజిక మాద్యమాలు, ఇతర మార్గాలలో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో ఎక్కవ మంది ప్రజలు ఈ విదానాన్ని వద్దని అభ్యర్థించడంతో ఈ ఆదివారం నుంచి ప్రతి రోజు లాగానే లాక్‌డౌన్‌ నిభందనలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్‌ భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఆదివారం ఇతర రోజుల్లో లాగే లాక్‌డౌన్‌ను పాటించాలని తెలిపింది. దీంతో ఆదివారం కర్ణాటకలో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాదాపు 3500 బస్సులను ఆదివారం నడపనుంది. అయితే శుక్రవారం ఒక్కరోజే కర్ణాటకలో 248 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇదే ఒక్కరోజు అత్యధిక కేసుల రికార్డు.