మహారాష్ట్ర సీఎం ఉధ్దవ్ థాక్రే వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఆగ్రహం, ఉపసంహరించుకోవాలని డిమాండ్

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న సామరస్య వాతావరణాన్ని ఆయన భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారని..,

మహారాష్ట్ర సీఎం ఉధ్దవ్ థాక్రే వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఆగ్రహం, ఉపసంహరించుకోవాలని డిమాండ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2021 | 3:43 PM

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న సామరస్య వాతావరణాన్ని ఆయన భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారని యెడ్యూరప్ప ఆరోపించారు.  మరాఠీ భాష, సంస్కృతి ఇంటిగ్రేషన్ సందర్భంగా థాక్రే చేసిన కామెంట్స్ భారతీయ సూత్రాలకు విరుధ్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తమ రాష్ట్రంలో మరాఠాలు కన్నడిగులతో కలిసిమెలిసి జీవిస్తున్నారని, అలాగే మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటున్న కన్నడిగులు కూడా మరాఠాలతో కలిసి ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సామరస్య వాతావరణంలో థాక్రే చేసిన వ్యాఖ్యలు ఆవేదన కలిగిస్తున్నాయని యెడ్యూరప్ప అన్నారు.

కాగా-కర్ణాటకలో ఉంటున్న మరాఠీల ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుతామని ఉధ్ధవ్ థాక్రే ఆదివారం ప్రకటించారు. పొరుగున కర్ణాటక వ్యాప్తంగా ఉన్న మరాఠీలను, మరాఠీ సంస్కృతిని మహారాష్ట్రలో కలిపిన పక్షంలో ఈ సరిహద్దుల్లో వార్ సందర్భంగా తమ ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించినట్టు అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. తాము ఇందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అసలే తమ బీజేపీలో తన పట్ల పెరుగుతున్న అసంతృప్తితో సతమతమవుతున్న యెడ్యూరప్పకు ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది.

Read Also:మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు, బీజేపీపై నిప్పులు కక్కిన మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే. Read Also:హైదరాబాద్‌ ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే : మంత్రి కేటీఆర్‌.