కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళ కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం..!

కర్ణాటక మంత్రి మండలి విస్తరణపై కసరత్తు పూర్తి. ఇవాళ కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం

కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళ కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం..!
Follow us

|

Updated on: Jan 11, 2021 | 7:30 AM

కర్ణాటకలో మరోసారి మంత్రివర్గ విస్తరణకుపై ముఖ్యమంత్రి యడియూరప్ప కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయన బీజేపీ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. కేంద్రం హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యడియూరప్ప ఆదివారంనాడు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ విస్తరణపై తాను మాట్లాడానని, గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూడా వివరించారని చెప్పారు.ఉప ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను కూడా చర్చించనున్నట్టు తెలిపారు.

‘గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూలంకషంగా వివరించాను. మంత్రివర్గ విస్తరణపైనా మాట్లాడాను. సాధ్యమైనంత త్వరలో పేర్లకు ఆమోద ముద్ర పడుతుంది. 100 శాతం ఇదే చివరి సమావేశమవుతుంది’ అని యడియారప్ప తెలిపారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఖాళీ అయిన సీట్లలో నెలలోపు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని, దీనిపై జాతీయ అధ్యక్షులు నడ్డాను కూడా కలుసుకుని చర్చిస్తానన్నారు. కాగా, యడ్యూరప్ప కేబినెట్ విస్తరణను ఈ రోజు ప్రకటించవచ్చని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా ఏడుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. తుది నిర్ణయం ఇవాళ ఉదయం తీసుకుంటామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. కొత్త కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జనవరి 13 న జరుగుతుందని ఆయన వెల్లడించారు.

అయితే, కొత్త మంత్రి మండలి స్థానం దక్కించుకునేందుకు భారీగా ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇదే చివరి విస్తరణ అవుతుందన్న సీఎం వ్యాఖ్యలతో పోటీ మరింతగా పెరిగింది. మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నవారిలో ఎమ్మెల్యేలు ఉమేష్ కుట్టి, మునిరత్న, బసంగౌడ పాటిల్ యత్నాల్, ఎంపి రేణుకాచార్య, అరవింద్ లింబవాలి, ఎస్ఆర్ విశ్వనాథ్లతో పాటు శాసనమండలి సభ్యులు సిపి యోగేశ్వర్, ఎంటిబి నాగరాజ్, ఆర్ శంకర్ ఉన్నారు. ఎంఎల్‌సి ఎహెచ్ విశ్వనాథ్ కూడా మినిస్టీరియల్ బెర్త్ కోసం బరిలో ఉన్నారు. కానీ కర్ణాటక హైకోర్టు తీర్పుతో అతని ఆశలు నీరిగారిపోయాయి. రాష్ట్ర మంత్రివర్గంలో 34 మంది మంత్రులకు అవకాశముంది. అయితే, ప్రస్తుతం 27 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఏడు మంత్రి పదవులను ఇవాళ భర్తీ చేసే అవకాశముంది.