20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?

KARNATAKA CABINET EXPANSION ON AUGUST 20, 20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?

కర్ణాటక సీఎం గా బీజేపీ నేత ఎదియూరప్ప ప్రమాణం చేసిన మూడు వారాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 న (మంగళవారం) బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ఆమోదం కూడా లభించింది. కేబినెట్ విస్తరణకు అనుమతించాలని ఎదియూరప్ప ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విస్తరణ పరిమితంగానే ఉంటుందని, కొంతమంది అసంతృప్త వాదులకు కేబినెట్లో స్థానం లభించవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని కాంగ్రెస్-జేడీ-ఎస్ తప్పు పట్టిన నేపథ్యంలో.. ఇక ఎడ్డీ నడుం బిగించక తప్పలేదు. ఆ మధ్య సుప్రీంకోర్టు కెక్కిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనుకూలంగా కోర్టు తీర్పు వఛ్చిన పక్షంలో వారిలో కొందరిని మంత్రి పదవులు వరించవచ్చునని సమాచారం. . కాగా-బీజేపీ ఎల్ఫీ సమావేశం కూడా మంగళవారం ఉదయం విధాన సౌధలో జరుగుతుందని, ఆ మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

KARNATAKA CABINET EXPANSION ON AUGUST 20, 20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *