స్పీకర్ పదవికి రమేష్ రాజీనామా.. నెక్స్ట్ ఎవరు..?

Karnataka Assembly Trust Vote : Yediyurappa Wins Floor Test.. Speaker Ramesh Kumar Resigns, స్పీకర్ పదవికి రమేష్ రాజీనామా.. నెక్స్ట్ ఎవరు..?

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గిన.. కాసేపటికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రమేష్ కుమార్ కాంగ్రెస్ ప్రతిపాదించిన స్పీకర్ కావడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బలపరీక్షలో యడియూరప్ప నెగ్గిన అనంతరం.. స్పీకర్ రమేష్ కుమార్ తన రాజీనామా లేఖను చదివి వినించారు.

రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేశానని.. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. స్పీకర్‌ పదవి వరించడం తన అదృష్టమన్నారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌గా రమేష్ వార్తల్లో నిలిచారు. రమేష్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎవరనే ఆసక్తి ఇరు పార్టీల్లో నెలకొంది. బీజేపీలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఏ సీనియర్ ఎమ్మెల్యేకు ఆ అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *