ఒడిశాకు కర్ణాటక రూ. 10కోట్ల సాయం

బెంగళూరు: ఫొని తుపానుతో ఒడిశా తీర ప్రాంతం చిగురుటాకులా ఒణికిపోయింది. అధికారులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గినా..తీవ్ర స్థాయిలో ఆస్థి నష్టం వాటిల్లింది  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. సహాయక చర్యల నిమిత్తం ఒడిశాకు రూ. 10కోట్లు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కన్నడ ప్రభుత్వం గురువారం అధికారిక ప్రకటించింది. ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు […]

ఒడిశాకు కర్ణాటక రూ. 10కోట్ల సాయం
Follow us

|

Updated on: May 09, 2019 | 9:12 PM

బెంగళూరు: ఫొని తుపానుతో ఒడిశా తీర ప్రాంతం చిగురుటాకులా ఒణికిపోయింది. అధికారులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గినా..తీవ్ర స్థాయిలో ఆస్థి నష్టం వాటిల్లింది  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. సహాయక చర్యల నిమిత్తం ఒడిశాకు రూ. 10కోట్లు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కన్నడ ప్రభుత్వం గురువారం అధికారిక ప్రకటించింది.

ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనేక గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి ఒడిశాలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు చేపట్టి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు.