ఇండోనేషియా టూ తెలంగాణ.. వయా డిల్లీ.. వీరి ప్లాన్ ఏంటీ..?

గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అందుకు కారణం.. కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియన్ల ప్రభావం. ఈ నెల 14 వ తేదీన ఓ పది మందికి పైగా ఇండోనేషియకు చెందిన ముస్లింలు.. కరీంనగర్‌కు చేరుకున్నారు.వీరంతా అక్కడ ఓ కోచింగ్ సెంటర్‌లో పోలీసులు రైడ్ చేసిన సమయంలో పట్టుబడ్డారు. అయితే రాష్ట్రంలో కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీచేసింది. […]

ఇండోనేషియా టూ తెలంగాణ.. వయా డిల్లీ.. వీరి ప్లాన్ ఏంటీ..?
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2020 | 9:07 PM

గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అందుకు కారణం.. కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియన్ల ప్రభావం. ఈ నెల 14 వ తేదీన ఓ పది మందికి పైగా ఇండోనేషియకు చెందిన ముస్లింలు.. కరీంనగర్‌కు చేరుకున్నారు.వీరంతా అక్కడ ఓ కోచింగ్ సెంటర్‌లో పోలీసులు రైడ్ చేసిన సమయంలో పట్టుబడ్డారు. అయితే రాష్ట్రంలో కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే కరీంనగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ తెరచి ఉండటంతో.. పోలీసులు రైడ్ చేశారు. దీంతో అక్కడ ఇండోనేషియన్‌కు చెందిన పది మంది పట్టుబడ్డారు. అయితే వీదేశీయులు కావడంతో.. వారిని కరోనా టెస్టులకు పంపించడంతో.. వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో కరీంనగర్ ప్రాంతమే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడింది. అందుకు కారణం.. వారంతా.. రామగుండంలో తిరగడమే..

కరీంనగర్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రభుత్వ, పోలీసుల అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యకమ్రమంలో దాదాపు 150 మందికి పైగా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే.. వీరు కేవలం 10 మంది కాకుండా.. పెద్ద సంఖ్యలోనే మన దేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రంలోనే వీరిని 32 మందిని గుర్తించారు. వీరిలో 30 మంది పెద్దలు ఉండగా.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కరీంనగర్‌లో పదిమందిని గుర్తించగా.. గురువారం రాత్రి హైదరాబాద్‌లొని మల్లెపల్లిలో మరో 8 మందిని గుర్తించారు.

నల్గొండలో మరో 12 మందితో పాటుగా.. ఇద్దరు పిల్లలను గుర్తించారు. వీరంతా.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రైల్వే మార్గం ద్వారా తెలంగాణకు చేరుకున్నట్లు గుర్తించారు. వీరంతా మత ప్రచారం అక్కడి నుంచి ఇక్కడి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇండోనేషియా నుంచి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వచ్చారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. ఢిల్లీలో వీరు సీఏఏ వ్యతిరేక ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ రిపోర్ట్స్ రావడంతో..వీరంతా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరిగారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

అంతేకాదు.. అసలు వీరంతా తెలంగాణకు ఎందుకు వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరంతా కరీంనగర్‌లొనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోని మత పెద్దల దగ్గర ఆశ్రయం పొందడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌లో ఈ ఇండోనేషియన్లకు ఆశ్రయం ఇచ్చిన మతపెద్దతో పాటుగా.. పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.