Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

కుళ్లిన స్థితిలో పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు.. హత్యనా..? ప్రమాదమా..?

Karimnagar crime news, కుళ్లిన స్థితిలో పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు.. హత్యనా..? ప్రమాదమా..?

Karimnagar crime news: తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి దగ్గర కాకతీయ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిన స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి చెల్లెలు, బావగా పేర్కొన్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం వీరు అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో గత నెల 27న కరీంనగర్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఇక ఆదివారం ఇదే ప్రదేశంలో మరో ప్రమాదం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో దంపతులను వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతుండగా.. ఈ కారు ఆచూకీ లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బంధువులది ప్రమాదమా..? లేక హత్యనా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు.

మరోవైపు కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ కమలాసన్‌ రెడ్డి.. ఈ రోజు ఉదయం 7గం.లకు కారును గుర్తించినట్లు తెలిపారు. జనవరి 27న ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని.. ఏడాది క్రితం సత్యనారాయణ రెడ్డి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని కమలాసన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కారుపై పలు చలాన్లు కూడా ఉన్నట్లు తాము గుర్తించామని ఆయన అన్నారు. అయితే కారు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా స్పందించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆయన అన్నారు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం తరచూ విహార యాత్రకు వెళ్లారని.. అలానే వెళ్లారని అనుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సత్యనారాయణ కుటుంబానికి ఎలాంటి విబేధాలు కూడా లేవని వారి మిత్రులు పేర్కొన్నారు.

Related Tags