కార్గిల్ విజయ్ దినోత్సవం: ఇండియా-పాక్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు

కార్గిల్ యుద్ధం.. 1999 మే-జూలై మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి ప్రతి భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మట్టికరిపించి.. ‘‘మా దేశాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి’’ అని పరోక్షంగా భారతీయులందరూ ఆ దేశానికి ఇచ్చిన హెచ్చరిక. దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్ నేమ్.. ‘ఆపరేషన్ విజయ్’. […]

కార్గిల్ విజయ్ దినోత్సవం: ఇండియా-పాక్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 12:15 PM

కార్గిల్ యుద్ధం.. 1999 మే-జూలై మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి ప్రతి భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మట్టికరిపించి.. ‘‘మా దేశాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి’’ అని పరోక్షంగా భారతీయులందరూ ఆ దేశానికి ఇచ్చిన హెచ్చరిక. దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్ నేమ్.. ‘ఆపరేషన్ విజయ్’. ఇక ఆ యుద్ధంలో అమర జవాన్ల పోరాటాన్ని స్మరించేందుకు భారత్ ఏటా జూలై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ్టికి ‘విజయ్ దివస్‌’కు 20ఏళ్లు కావడం విశేషం.

కార్గిల్ యుద్ధానికి మొదటి కారణం పాకిస్తాన్ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత‌దేశంలోకి చొరబడటం.1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్థాన్ మధ్య శాంతియుత లాహోర్ ఒప్పందం జరిగింది. దీని ద్వారా జమ్మూకాశ్మీర్ విషయంలో రెండు దేశాలూ దౌత్యపరంగా, శాంతియుతంగా పరిష్కారం చూపుకోవాలని అనుకున్నాయి. కానీ పాకిస్థాన్ సైన్యం కుట్రలు పన్ని… ఉగ్రవాద మూకల్ని భారత భూభాగంలోకి పంపాయి. దానికి ‘ఆపరేషన్ బద్ర్’ అనే పేరు పెట్టాయి. కాశ్మీర్, లఢక్ మధ్య లింక్ తెగ్గొట్టి… సియాచిన్ హిమ పర్వతాల నుంచీ భారత్ సైన్యాన్ని పంపేయాలన్నది పాక్ కుట్ర. మొదట్లో పాకిస్తాన్.. ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా వెల్లడించినప్పటికీ.. యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉన్నట్లు రుజువైంది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద ఈ యుద్ధం జరగడం వల్ల ఇరు దేశాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. గడ్డకట్టే చలిలో.. పర్వతాల్లో ఏ మాత్రం సహకరించని వాతావరణంలో.. దాదాపు 60రోజుల పాటు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌కు చెందిన 527మంది జవాన్లు వీరమరణం పొందారు.

యుద్ధం ఎలా మొదలైందంటే.. హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ.. వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగు.

ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. దీనిపై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా.. పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999, మే 3న భారత సైన్యం రంగంలోకి దిగింది.

ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..

  • 3 మే-కార్గిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు.
  • 5 మే- భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి చంపేసారు.
  • 9 మే- పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.
  • మే 10- ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు.
  • మే మధ్యలో- భారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది.
  • మే 26- చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది.
  • మే 27- భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
  • మే 28- వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.
  • జూన్ 1- పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
  • జూన్ 5- ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది.
  • జూన్ 6- భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది.
  • జూన్ 9- బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.
  • జూన్ 11- పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జనరల్ పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది.
  • జూన్ 13- ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
  • జూన్ 15- అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.
  • జూన్ 29- భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది
  • జూలై 2- భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.
  • జూలై 4- 11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది
  • జూలై 5- భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
  • జూలై 7- బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
  • జూలై 11- పాకిస్తాన్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్‌ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
  • జూలై 14- ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాడు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.
  • జూలై 26- కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టామని భారత సైన్యం ప్రకటించింది.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..