పాక్‌, చైనాలకు బలూచ్ లీడర్ స్ట్రాంగ్‌ వార్నింగ్..

పాకిస్థాన్‌, చైనా దేశాలకు బలూచ్ లీడర్‌ బుధవారం నాడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం నాడు కరాచీ స్ట్రాక్ మార్కెట్‌పై దాడి చేసిన ఘటనలో చనిపోయిన ఉగ్రవాదులకు సంతాపం తెలుపుతూ..

పాక్‌, చైనాలకు బలూచ్ లీడర్ స్ట్రాంగ్‌ వార్నింగ్..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 8:22 PM

పాకిస్థాన్‌, చైనా దేశాలకు బలూచ్ లీడర్‌ బుధవారం నాడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం నాడు కరాచీ స్ట్రాక్ మార్కెట్‌పై దాడి చేసిన ఘటనలో చనిపోయిన ఉగ్రవాదులకు సంతాపం తెలుపుతూ.. బలూచ్ లీడర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బలూచిస్థాన్‌ నుంచి పాక్‌, చైనాకు చెందిన వారు వెళ్లిపోవాలని హెచ్చిరంచారు. తాము తమ మాతృభూమి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. చైనా కన్ను తమ భూమిపై పడిందని.. పాక్ అందుకు అక్రమంగా తమ భూములను లీజుకిస్తోందన్నారు. ఇది తమకే కాదు.. యావత్ ప్రపంచానికి చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తమ భూభాగంలోని గ్వాడర్ ప్రాంతంలో పెత్తనం చెలాయించాలని చూస్తోందని.. వెంటనే ఇక్కడి నుంచి నిష్కృమించకపోతే.. రాబోయే రోజుల్లో అనేక దాడులు చవిచూడాల్సి వస్తుందని బలూచ్ లీడర్ అటు చైనాకు.. ఇటు పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.