కాపు రిజర్వేషన్లకు మేము అనుకూలమే : సీఎం జగన్

Kapu Reservation issue Jagan Accuses TDP Chief Chandrababu Naidu of Cheating Community, కాపు రిజర్వేషన్లకు మేము అనుకూలమే : సీఎం జగన్

ఏపీలో కాపు సామాజికవర్గం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు ఏపీ సీఎం జగన్. కాపుల కోసం గత ప్రభుత్వం వేసిన మంజునాథ కమిషన్‌పై చర్చించేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లపై జరుగుతున్న తాజా పరిణామాలపై అదే సామాజికవర్గానికి చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్లే ప్రస్తుతం కాపులు బీసీలా, ఓసీలా అనే అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించేలా ఆపార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కన్నబాబులను కమిటీగా ఏర్పాటు చేశారు.

కాపులను బీసీల జాబితాలో చేర్చే విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాలపై మండిపడ్డారు సీఎం జగన్. ఈబీసీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైనా న్యాయస్ధానాల్లో కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం నిజమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీసీల హక్కులకు భంగం కలగకుండా, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తమపార్టీవ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో కాపులకు రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి కాపులకు న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *