తండ్రి కాబోతున్న కపిల్‌శర్మ

“అవును నిజమే నా భార్య గర్భవతి.. త్వరలోనే మా కుటుంబంలోకి అడుగుపెట్టనున్న బుజ్జి పాపాయి కోసం మేము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం” అంటున్నాడు ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ. తనదైన ప్రత్యేకశైలిలో సైటైరికల్ కామెడీని పండించడంలో సిద్ధహస్తుడైన కపిల్‌శర్మ తన భార్యతో కలిసి ముంబై మిర్రర్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. తమ చిన్న కుటుంబంలోని త్వరలోనే ఓ ప్రత్యేకత కలిగిన చిన్న అతిథి రాబోతున్నాడని ఆనందంలో చెప్పాడు. మేము ఇద్దరం ప్రస్తుతానికి వేరే విషయాలేమీ […]

తండ్రి కాబోతున్న కపిల్‌శర్మ
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 10:30 AM

“అవును నిజమే నా భార్య గర్భవతి.. త్వరలోనే మా కుటుంబంలోకి అడుగుపెట్టనున్న బుజ్జి పాపాయి కోసం మేము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం” అంటున్నాడు ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ. తనదైన ప్రత్యేకశైలిలో సైటైరికల్ కామెడీని పండించడంలో సిద్ధహస్తుడైన కపిల్‌శర్మ తన భార్యతో కలిసి ముంబై మిర్రర్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

తమ చిన్న కుటుంబంలోని త్వరలోనే ఓ ప్రత్యేకత కలిగిన చిన్న అతిథి రాబోతున్నాడని ఆనందంలో చెప్పాడు. మేము ఇద్దరం ప్రస్తుతానికి వేరే విషయాలేమీ అలోచించడంలేదని, ముఖ్యంగా తన భార్య మంచి ఆరోగ్యంతో ఉండాలని, మాకు పండంటి బిడ్డపుట్టాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు. అలాగే పుట్టబోయే చిన్నారి ఆడ, మగ అనే విషయాల్లో తమ ఇద్దరికీ ఎలాంటి పట్టింపు లేదన్నాడు కపిల్. గిన్ని ఛత్రాతో కపిల్‌శర్మ వివాహం గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది.