మాయమాటలతో మూడుకోట్లుపైగా కొట్టేశాడు

గతేడాది సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 10 టన్నుల అమ్మోనియా తరలించిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు తరలించిన కేసులో..

మాయమాటలతో మూడుకోట్లుపైగా కొట్టేశాడు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 7:48 PM

గతేడాది సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 10 టన్నుల అమ్మోనియా తరలించిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు తరలించిన కేసులో రాజ్ కుమార్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఆసరా చేసుకుని కపిల్ రాజేంద్ర అనే వ్యక్తి రాజ్ కుమార్ నుంచి భారీగా డబ్బు గుంజడం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులో బెయిల్ పై విడుదల చేయిస్తా అని రాజ్ కుమార్ ను నమ్మించిన సన్నిహితుడు కపిల్ కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో హవాలా ఏజెంట్ ద్వారా రాజ్ కుమార్ 60 లక్షలు చెల్లించాడు. తర్వాత మొత్తం కేస్ ను మూసి వేయించడానికి సీనియర్ పోలిస్ అధికారులకు 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటు రాజ్ కుమార్ ను నమ్మించిన కపిల్.. కోటిన్నర కొట్టేశాడు. అయితే, ఈ డబ్బు తో సంబంధం లేకుండా రాజ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్ట్.

ఇక, జైల్ నుండి బయటికి వచ్చాక కపిల్ కు మరో 20 లక్షలు చెల్లించాడు రాజ్ కుమార్. అయితే, తిరిగి రాజ్ కుమార్ పై గత ఏడాది అక్టోబర్ లో మరో కేస్ నమోదు చేశారు ఎస్వో టి పోలీసులు. భువనగిరి నుండి ఇతర రాష్ట్రాలకు కంటైనర్ లలో పేలుడు సామగ్రి నీ తరలిస్తున్న రాజ్ కుమార్ పై కేసులు మోపారు. ఇందులో భాగంగా అక్టోబర్ లో రాజ్ కుమార్ కంపెనీ పై భువనగిరిలో లో దాడులు చేశారు. దీంతో మళ్లీ ఎంటరైన కపిల్.. తాజా రెండు కేసులు ముయిస్తా అంటూ 35 లక్షలు డిమాండ్ చేశాడు. వీటి పై పాట్నా బీహార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారంటూ రాజ్ కుమార్ ను భయపెట్టాడు. వాళ్ళను నీ జోలికి రాకుండా చుసుకుంటానంటు రాజ్ కుమార్ దగ్గర మరో కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో మొత్తంగా 3 కోట్ల 60 లక్షలు కపిల్ కు చెల్లించాడు రాజ్ కుమార్.

అయితే, ఇంకా డబ్బు కావాలని బెదిరిస్తుండటంతో కపిల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాజ్ కుమార్. దీంతో పూణె కి వెళ్లి కపిల్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మొత్తం వ్యవహారంపై కూపీలాగే పనిలో పడ్డారు.

సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి