వృద్ధ పూజారిపై పోలీసుల ఓవరాక్షన్‌..కప్పలా గెంతించి..

యూపీలో పోలీసులు ఓ వృద్ధ పూజారిపై ఓవరాక్షన్ చేశారు. కాన్పూర్‌లోని పనకీలోగల ఓ ఆలయంలో.. పూజలు చేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పెట్రోలింగ్‌ విధులు చేపడుతున్న ఓ ఎస్‌ఐ పూజారిని మందలిస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా.. అతన్ని ఆలయం వరకు కప్పలా గెంతుకుంటూ వెళ్లాలంటూ ఆదేశించాడు. సదరు పూజారి ఎస్ఐ బెదిరింపులకు బయపడి కప్పలా గెంతాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించాడన్న […]

వృద్ధ పూజారిపై పోలీసుల ఓవరాక్షన్‌..కప్పలా గెంతించి..
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 3:15 PM

యూపీలో పోలీసులు ఓ వృద్ధ పూజారిపై ఓవరాక్షన్ చేశారు. కాన్పూర్‌లోని పనకీలోగల ఓ ఆలయంలో.. పూజలు చేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పెట్రోలింగ్‌ విధులు చేపడుతున్న ఓ ఎస్‌ఐ పూజారిని మందలిస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా.. అతన్ని ఆలయం వరకు కప్పలా గెంతుకుంటూ వెళ్లాలంటూ ఆదేశించాడు. సదరు పూజారి ఎస్ఐ బెదిరింపులకు బయపడి కప్పలా గెంతాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సదరు వృద్ధ పూజారిని కప్పలా గెంతుతూ ఆలయానికి వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు పూజారి పట్ల అతిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.