‘అర్జున్ పండిట్’ సినిమా చూసి… వికాస్ దూబే గత చరిత్రలో ఒక్కసారి..

యూపీ హిస్టరీ షీటర్ వికాస్ దూబే గత చరిత్రకు సంబంధించి ఓ కొత్త విషయం బయటపడింది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ 1999 లో నటించిన 'అర్జున్ పండిట్' మూవీని చూసిన వికాస్ దూబే..

'అర్జున్ పండిట్' సినిమా చూసి... వికాస్ దూబే గత చరిత్రలో ఒక్కసారి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 3:20 PM

యూపీ హిస్టరీ షీటర్ వికాస్ దూబే గత చరిత్రకు సంబంధించి ఓ కొత్త విషయం బయటపడింది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ 1999 లో నటించిన ‘అర్జున్ పండిట్’ మూవీని చూసిన వికాస్ దూబే.. ఫిదా అయిపోయాడట. అది ఎంతగా నచ్చిందంటే.. దాన్ని వందలాది సార్లు చూశాడని అతని స్వభావాలు తెలిసిన లోకల్ జర్నలిస్టులు తెలిపారు. ఆ చిత్రంలో మాదిరే తనను అంతా ‘పండిట్’ అని పిలవాలని కోరేవాడట. రాజకీయ, పోలీసు వర్గాల్లో చాలామంది ఇతడి మెప్పుకోసం అలా పిలిచేవారని ఆ జర్నలిస్టులు చెప్పారు. అయితే ఇతని నేర చరిత్రకు, ఆ సినిమాకు పోలిక లేదు. ఆ చిత్రంలో అర్జున్ (సన్నీ డియోల్) ఓ పవర్ ఫుల్ వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారడం, ఓ నేరాన్ని చూసి కూడా కామ్ గా ఉండిపోవడం, తాను ప్రేమించిన ప్రియురాలే తనను మోసం చేయడంతో గ్యాంగ్ స్టర్ గా మారిపోవడంవంటి మసాలాలన్నీ ఉంటాయి. ఇక్కడ పండిట్ అన్న పదమే దూబేని చాలా ఆకర్షించిందట.. ఇలా ఉండగా ఇతని క్లిమినల్ హిస్టరీ నచ్చని ఇతని కుటుంబం ఇతడిని దూరం పెట్టిందని, తల్లితో సహా కుటుంబ సభ్యులు ఇతడ్ని పోలీసులు అంతమొందించాలని కోరేవారని తెలిసింది.