Breaking News
  • వచ్చే నెల 6న జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశం. అపెక్స్ కౌన్సిల్ లో చర్చించాల్సిన వ్యూహంపై మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం. తెలంగాణ ఇరిగేషన్ సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలను తీసుకుని రావలసిందిగా అధికారులకు సీఎం ఆదేశం. ఆంధ్ర ప్రదేశ్ నదీజలాల విషయంలో కావాలనే కయ్యం పెట్టుకుంటుంది. ఏపీ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలి. అపెక్స్ సమావేశం లో కేంద్ర ప్రభుత్వ ఏడు సంవత్సరాల అలసత్వాన్ని తీవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడం జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. తెలంగాణ ఏర్పడిన వెంటనే కొత్త రాష్ట్రంగా నీటి కేటాయింపులు జరపాలని 2014లో ప్రధానమంత్రికి లేఖ రాశాను. ఏళ్లు అవుతున్నా ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన లేదు.
  • అమరావతి: డిజిపి గౌతమ్ సవాంగ్ కామెంట్స్. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ కు ధన్యవాదాలు . జ్యువినల్ జస్టిస్ ద్వారా అనేక మంది అనాధ బాలికలు, బాలురు ను నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తాం. సమాజంలో అనాధ బాలురు ,బాలికలు త్వరగా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అనాధ బాలురు ,బాలికలను గుర్తించి వారిని నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలి. హై కోర్ట్ న్యాయ మూర్తి విజయ లక్ష్మీ కామెంట్స్. అనాధ బాలురు ,బాలికలు నేరాలకు ఎందుకు పాలపడ్తున్నారో పోలీసులు విచారణ చేయాలి. జ్యువినెల్ జస్టిస్ అమలో ఉన్నప్పటికీ లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. అనాధ పిల్లలకు ఇంటి వాతావరణం కల్పించలు. అనాధ పిల్లలు జేజే ఆక్ట్ ప్రకారం వీలైనంత త్వరగా వల్ల తల్లిదండ్రులు చెంత చేర్చాలి. జేజే యాక్ట్ ప్రకారం చైల్డ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయాలి. సెక్షన్ 83 ప్రకారం అనాధ పిల్లల హోమ్స్ పై ప్రతి నెల ఒకసారి పోలీసులు పర్యవేక్షణ కచ్చితంగా ఉండలి. సెక్షన్ 39 ప్రకారం సిబ్బిలింగ్స్ ను ఒకే హోమ్ లో ఉండే విధమైన చర్యలు చేపట్టాలి. చైల్డ్ హోమ్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పర్యవేక్షణ నిర్వహించాలి. సమాజం లో ప్రతి ఒక్కరకి అనాధ పిల్లల పై బాధ్యత ఉంది. బాల నెరస్థలను వ్యవహార సైలి లో మార్పు వచ్చే విధంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. మరో సారి హై కోర్ట్ జేజే కమ్మిటి గా ఉండే రోజు రాకూడదు.
  • అమలాపురంలో నగల వ్యాపారి మిస్సింగ్.. తూ. గో.. జిల్లా: అమలాపురం: మూడు రోజుల క్రితం వ్యాపార నిమిత్తం విజయవాడ నుండి అమలాపురం వచ్చిన నగల వ్యాపారి జైన్ కౌశిక్ కుమార్ ..అదృశ్యం. రెండు రోజులు అమలాపురం కొకస్ లాడ్జి లో బస చేసి ఇక్కడ పనులు ముగించుకుని వస్తున్నానని బంధువులకు ఫోన్ ధ్యారా తెలియపరిచిన జైన్ కౌశిక్ కుమార్. ఎప్పటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేసిన జైన్ కౌశిక్ ..చిన్నాన్న జైన్ హేమేoద్రా . మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమలాపురం పట్టణ పోలీసులు.
  • పోలీస్ ఫేక్ ప్రొఫైల్స్ ముఠా ను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పోలీస్ ఖాతా లు సృష్టించి డబ్బు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు అరెస్ట్. రాజస్థాన్ భరత్ పూర్ నుండి ఆపరేట్ చేస్తున్న ముఠాలు. పోలీస్ ల ప్రొఫైల్స్ తో మరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బు అవసరం ఉందంటూ లక్షల్లో డబ్బు కాజేసిన ముఠాలు. నల్గొండ ఎస్పి రంగనాథ్ పేరుతో మొదలైన ఫేక్ ప్రొఫైల్స్ మోసం. రాజస్థాన్ భరత్ పూర్ నుండి ఆపరేట్ చేస్తున్న కొంత మంది యువకులు. నిందితుల నుండి భారీగా సిం కార్డ్స్ స్వాధీనం. 10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్న నల్గొండ పోలీసులు. ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం. దేశ వ్యాప్తంగా 230 మంది పోలీసుల ప్రొఫైల్స్ తో మోసం. తెలంగాణ లో 100 మంది పోలీసుల ఫేస్ బుక్ అకౌంట్ తో సైబర్ నేరానికి పాల్పడిన ముఠా. అడిషనల్ డిజి నుండి కానిస్టేబల్స్ వరకు ఫేక్ అకౌంట్స్ తో హడలెత్తించిన ముఠా. నిందితుల్లో మైనర్ లే ఎక్కువ, 8, 9 తరగతులు మాత్రమే చదువుకున్న ముఠా సభ్యులు. తెలంగాణ, ఏపి, తమిళ్ నాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడ్డిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని మోసాలకి పాల్పడిన నిందితులు. భరత్ పూర్ లో నిందితుల నుండి ప్రతి ఘటన ఎదురు కాకుండా చాక చక్యంగా వ్యవహరించిన నల్గొండ పోలీసులు.
  • నేటి నుండి TS.Ed.CET-2020 ఎగ్జామ్ . అక్టోబర్ 1 మరియు 3 తేదీలలో TS.Ed.CET-2020. బి.ఎడ్ 2 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే TS.Ed.CET-2020. మొత్తం 43380 మంది అభ్యర్థులు . 10339 మంది పురుషులు (24%) మరియు 33041 మంది స్త్రీలు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించబడుతుంది. అక్టోబర్ 1 న, మధ్యాహ్నం 3 గంటల నుండి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు. మార్నింగ్ సెషన్‌లో మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ . మధ్యాహ్నం సెషన్‌లో బయోలాజికల్ సైన్సెస్, ఇంగ్లీష్,ఓరియంటల్ లాంగ్వేజెస్ . అభ్యర్థులు గుర్తించి పరీక్షా కేంద్రం 90 కి చేరుకోవాలని అభ్యర్థించారు. ఒక నిమిషం నిబంధన అమలు. అభ్యర్థులు తమ సొంత మాస్క్‌ను తీసుకురావాలి. గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ మరియు పారదర్శక వాటర్ బాటిల్ . పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి.
  • MBA,MCA ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఐ సెట్ ప్రవేశ పరీక్ష రెండో రోజు. ఇవ్వాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న టీ ఎస్ ఐసెట్. తెలంగాణ, ఏపీ లో కలిపి 55,578మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం,మధ్యాహ్నం రెండు సెషన్ లలో జరగనున్న ఐ సెట్ ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ పద్దతిలో జరగనున్న పరీక్ష. ఈసారి ఐ సెట్ పరీక్ష ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఉదయం 8గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష వుంటుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి 5.30 వరకు రెండవ శేషన్ వుంటుంది. విద్యార్థి ఖచ్చితంగా మాస్క్ ధరించి లోపలికి రావాల్సి ఉంటుంది. పూర్తి కరోనా నిబంధనలతో పరీక్ష నిర్వహిస్తా మంటున్న నిర్వాహకులు.
  • అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న థియేటర్లు . లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలయ్యే తొలి సినిమా కరోనా వైరస్ అని వర్మ వెల్లడి.

విమానాశ్ర‌యంలో ప‌ట్టుబ‌డ్డ విదేశీ క‌రెన్సీ

కేర‌ళ‌లోని విమానశ్రయాలు స్మగ్లర్లకు అడ్డగా మారుతున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ స్కాంపై విచారణ సాగుతుండగానే భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. క‌న్నౌర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాదాపు రూ.10.40 ల‌క్ష‌ల విలువ చేసే ఫారిన్ క‌రెన్సీని సీజ్ చేసింది.

foreign currency seized, విమానాశ్ర‌యంలో ప‌ట్టుబ‌డ్డ విదేశీ క‌రెన్సీ

కేర‌ళ‌లోని విమానాశ్ర‌యాలు స్మగ్లర్లకు అడ్డగా మారుతున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ స్కాంపై విచారణ సాగుతుండగానే భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. క‌న్నౌర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాదాపు రూ.10.40 ల‌క్ష‌ల విలువ చేసే ఫారిన్ క‌రెన్సీని సీజ్ చేసింది.

అందులో 12,500 అమెరికన్ డాల‌ర్లు, 4,210 యూఏఈ దీర‌మ్‌లు, 5,145 చైనా యువాన్‌లు ఉన్నాయి. కేర‌ళ నుంచి అబు దుబాయ్‌కి వెళ్తున్న ప్ర‌యాణికుడి నుంచి అధికారులు ఈ క‌రెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్‌పోర్టులోని సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌ స‌హ‌కారంతో తాము విదేశీ క‌రెన్సీని ప‌ట్టుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని కొచ్చి క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌రేట్‌కు చెందిన అధికారులు తెలిపారు.

Related Tags