Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

బుల్లితెర నటి చందన ఆత్మహత్య

సినిమాల్లో నటిగా రాణించాలని కలలు కంది. దాని కోసం పల్లెను వదిలి పట్నానికి చేరుకుంది. బుల్లితెరపై వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇంతలోనే ఓ నయవంచకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకుంది. దీంతో సినిమాల్లో నటించాలన్న కల నెరవేరకుండానే కన్నుమూసింది.
, బుల్లితెర నటి చందన ఆత్మహత్య

సినిమాల్లో నటిగా రాణించాలని కలలు కంది. దాని కోసం పల్లెను వదిలి పట్నానికి చేరుకుంది. బుల్లితెరపై వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇంతలోనే ఓ నయవంచకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకుంది. దీంతో సినిమాల్లో నటిగా రాణించాలన్న కల నెరవేరకుండానే కన్నుమూసింది.
కర్నాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన సినిమాల్లో నటించాలని కోరికతో బెంగళూరుకు వచ్చింది. కన్నడ బుల్లితెరతో పాటు పలు ప్రకటనలు, సినిమాలో చిన్నచిన్న పాత్రల్లో ఆమె నటించింది. ఇంతలో ఓ వంచకుడి కన్ను చందనపై పడింది. ప్రేమ పేరుతో తీయని మాటలు చెప్పి ఐదేళ్లు మోజు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో జరిగిన మోసానికి కుంగిపోయిన ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది కన్నడ టీవీ నటి చందన. పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కన్నడ సినిమాల్లో వెలుగొందాలని ఎన్నో కలలు కన్న చందన జీవితం చివరికి విషాదాంతమైంది.
విషాన్ని తాగుతూ తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలో చెప్పింది. ప్రియుడు దినేశ్‌ చేసిన మోసాలను ఏకరవుపెట్టిన చందన సెల్ఫీ వీడియోలో బోరుమంది. చందన తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితుడు దినేష్ పై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో దినేశ్‌ పరారీలో ఉన్న నిందితుడు దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే..
చందన, దినేశ్‌లు ఐదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇటీవల ప్రియుడు దినేష్ దగ్గర చందన పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చింది. దీంతో ఐదేళ్లుగా చందనతో తిరిగిన దినేష్ పెళ్లి చేసుకోవాలని అడగగానే ముఖం చాటేశాడు. దీంతో ఏం చేయాలో తోచని చందన దినేశ్‌ కుటుంబసభ్యుల దగ్గర తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని చెప్పింది. అయితే దినేష్ కుటుంబ సభ్యులు చందనను అవమానించి పంపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె జీవితం మీద విరక్తి చెందిన చందన తన నివాసంలో పురుగుల మందు తాగింది. ఆ వీడియోను ప్రియునికి వాట్సప్‌ చేసింది. వెంటనే అక్కడికి చేరుకొని చందనను ఒక ఆస్పత్రికి తరలించి నిందితుడు దినేష్ పరారయ్యాడు. పురుగులమందు ఎక్కువగా తాగడంతో ఆమె కొంతసేపటికే ప్రాణాలు వదిలింది.
డబ్బు, కెరీర్‌, జీవితాన్నే నీకు అర్పిస్తే మోసం చేస్తావా..,మరో అమ్మాయిని ఇలా మోసం చేయకు అంటూ వీడియోలో తెలిపింది. ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దినేశ్‌ గతంలోనూ పలువురు అమ్మాయిలను ఇలానే మోసగించినట్లు ఆరోపణలున్నాయి. సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్‌ కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Tags