వరుణ్‌ సినిమాలో నటిస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..!

గతేడాది వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్‌.. ఇప్పుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో నటించబోతోన్న విషయం తెలిసిందే.

వరుణ్‌ సినిమాలో నటిస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 27, 2020 | 5:12 PM

గతేడాది వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్‌.. ఇప్పుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో నటించబోతోన్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. ఇక దీనిపై తాజాగా ఆ నటుడు క్లారిటీ ఇచ్చేశారు. వరుణ్ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఉపేంద్ర వివరించారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత తెలుగులో తనకు చాలానే ఆఫర్లు వచ్చాయని.. కానీ అవన్నీ విలన్ పాత్రలేనని ఉపేంద్ర తెలిపారు. అయితే సరైన స్క్రిప్ట్, పాత్ర కోసం తాను ఎదురుచూశానని.. ఇక వరుణ్ సినిమాలో క్యారెక్టర్ నచ్చి ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకున్నట్లు వివరించారు. ఇక ఈ హీరో మాటలను బట్టి చూస్తే.. ఇందులో ఉపేంద్ర విలన్ పాత్రలో కాకుండా మరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నారు.

Read This Story Also: ఆసుపత్రి భవవం నుంచి దూకి.. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య..!