Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

ఉపేంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పుట్టిన రోజు ఇవాళ. తెలుగులోనూ పలు విభిన్నమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఉపేంద్ర బాగా దగ్గరయ్యారు.

Kannada Hero upendra birthday varun tej nagababu tweets, ఉపేంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పుట్టిన రోజు ఇవాళ. తెలుగులోనూ పలు విభిన్నమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఉపేంద్ర బాగా దగ్గరయ్యారు. ఇంతకుముందు అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో కీలక రోల్ ప్లే చేసిన ఉపేంద్ర, త్వరలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘బాక్సర్’ అనే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. ఉపేంద్ర సార్.. అంటూ బర్త్ డే విషెస్ చెప్పిన వరుణ్ తేజ్.. మీతో షూటింగ్ లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నానంటూ మెసేజ్ పెట్టాడు. అటు, మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మీరు ఎంచుకున్న విభిన్నమైన పాత్రలు మిమ్మల్ని బహుముఖ ప్రజ్ణాశాలిగా నిలబెట్టాయని నాగబాబు అన్నారు. కాగా, సినీ, రాజకీయ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఉపేంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. దశాబ్ద కాలానికి ముందే టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ హీరో.. తను మాత్రమే చేయగలనన్న రీతిలో వెరైటీ సినిమాలతో తెలుగు నాట చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. తెలుగులో డైరెక్ట్ గా నటిస్తూనే, తన కన్నడ సినిమాలను తెలుగులోకి అనువాదం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నారు. 2003, డిసెంబరు 14 న తన కోస్టార్, మిస్ కోల్ కతా ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నారు ఉపేంద్ర. నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా బహుముఖాలుగా తన టాలెంట్ చూపించిన ఉపేంద్ర.. అటు, కన్నడనాట రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం.

Related Tags