పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై.. కన్నా కీలక వ్యాఖ్యలు..

ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వనరుల విషయంలో

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై.. కన్నా కీలక వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 3:17 PM

Kanna Lakshminarayana: ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వనరుల విషయంలో వివాదస్పదంగా మారుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా లాక్ డౌన్ వేళ.. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలోని క్వారంటైన్ కేంద్రాన్ని మాజీమంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 120 మంది బాధితులు ఉన్నారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే మా ఉద్దేశమని, ఈ అంశంపై గతంలో బీజేపీ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాయలసీమకు మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేరకు న్యాయ పోరాటం చేస్తుందో తెలియదని పేర్కొన్నారు.

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!