ఇలాంటి పిచ్చి పనులు సరికావు: జగన్‌పై కన్నా విమర్శలు

మూడు రాజధానుల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తానడం సరికాదని ఆయన అన్నారు. రాజధాని ప్రాంత రైతులు మంగళవారం గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు ఆయనను కోరారు. దీనిపై స్పందించిన కన్నా.. సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని […]

ఇలాంటి పిచ్చి పనులు సరికావు: జగన్‌పై కన్నా విమర్శలు
Follow us

| Edited By:

Updated on: Dec 25, 2019 | 8:09 AM

మూడు రాజధానుల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తానడం సరికాదని ఆయన అన్నారు. రాజధాని ప్రాంత రైతులు మంగళవారం గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు ఆయనను కోరారు. దీనిపై స్పందించిన కన్నా.. సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని వారికి భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని తెరపైకి తెచ్చారని, ఇలాంటి పిచ్చి పనులు సరికావని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కన్నా అన్నారు. జగన్ పాలనలో కక్షసాధింపు ధోరణి కనబడుతోందని.. ఆయనవి పిల్ల చేష్టలని మండిపడ్డారు. ఇది రైతుల ఒక్కరి సమస్యే కాదని.. రాజధాని సమస్య అని చెప్పుకొచ్చారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితోనే వెళ్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనకు మొదట్లో కన్నా మద్దతిచ్చిన విషయం తెలిసిందే.