విలీన మండలాల్లో కేంద్రం జోక్యం.. కన్నా తేల్చేశారా?

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణ నుంచి ఆంధ్రలో విలీనమైన ఏడు మండలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన విలీన మండలాల్లో సీఏఏ, ఎన్నార్సీ అనుకూల యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలీన మండలాల విషయంలో బిజెపి ఏంచేయబోతోందో వెల్లడించారు. కేంద్రం ఏ కోణంలో జోక్యం చేసుకోబోతోందో చూచాయగా చెప్పారు. విలీన మండలాల్లో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పర్యటన సందర్భంగా ముందుగా సీఏఏ, ఎన్నార్సీలపై మాట్లాడారు. సిటిజెన్ అమెండ్మెంట్ యాక్ట్‌తో నిజమైన […]

విలీన మండలాల్లో కేంద్రం జోక్యం.. కన్నా తేల్చేశారా?
Follow us

|

Updated on: Dec 30, 2019 | 2:41 PM

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణ నుంచి ఆంధ్రలో విలీనమైన ఏడు మండలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన విలీన మండలాల్లో సీఏఏ, ఎన్నార్సీ అనుకూల యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలీన మండలాల విషయంలో బిజెపి ఏంచేయబోతోందో వెల్లడించారు. కేంద్రం ఏ కోణంలో జోక్యం చేసుకోబోతోందో చూచాయగా చెప్పారు.

విలీన మండలాల్లో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పర్యటన సందర్భంగా ముందుగా సీఏఏ, ఎన్నార్సీలపై మాట్లాడారు. సిటిజెన్ అమెండ్మెంట్ యాక్ట్‌తో నిజమైన భారత్ పౌరులకు ఎటువంటి ఇబ్బంది కాదని కన్నా స్పష్టం చేశారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ముస్లిం మైనారిటీలకు తప్పుడు సమాచారం ఇస్తూ హింసకు ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకుంటూ, వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలతో.. అసత్యాలతో హింసకు ఆజ్యం పోస్తోందని విమర్శించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో వున్న సమస్యలను ఒక్కొక్కటిగా మోడీ ప్రభుత్వం పరిష్కరిస్తూ ఉంటే, చూసి ఓర్వలేక తప్పుడు సమాచారంతో ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కన్నా.

పోలవరం నిర్వాసితుల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ ప్రాంతం జాతీయ నాయకులకు ఒక ఏటీఎం లాగా మారిందని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితుల త్యాగాలను పట్టించుకోకుండా ఈ జిల్లాలో పని చేస్తున్న అధికారులు వీరిపై వివక్ష చూపిస్తున్నారని కన్నా కామెంట్ చేశారు. నిర్వాసితుల త్యాగంపై ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు. వారి త్యాగాలకు ప్రతిఫలంగా ప్రతీ ఒక్క నిర్వాసిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం వుందని చెప్పారు.

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..