చీర ధర సరే.. మరి బ్యాగ్ సంగతేంటి..?

Kangana Ranaut Brutally Trolled For Wearing Rs.600 Saree, చీర ధర సరే.. మరి బ్యాగ్ సంగతేంటి..?

హీరో, హీరోయిన్లు ఏమి ధరించినా.. ఎక్కడికి వెళ్లినా వారి అభిమానులు ఫాలో అయిపోతుంటారు. కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు.. వారి ఫాలోయింగ్ అంతా కాదు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ధరించిన ఓ చీర గురించి ఇంటర్‌నెట్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర కేవలం రూ. 600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి గంగోలి ఓ ట్వీట్ చేసింది. ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ. 600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడిందని ట్వీట్ చేసింది. దాంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది. అయితే గంగోలి ట్వీట్ పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కట్టుకున్న చీర రూ.600 అది బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లక్షల ఖరీదు చేస్తుందని.. మీరు మాత్రం కేవలం చీర గురించే చెబుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *