సోషల్ మీడియాలో కామెంట్లు, కంగనా సిస్టర్స్ కి మళ్ళీ ముంబై పోలీసుల సమన్లు

కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీలకు ముంబై పోలీసులు మళ్ళీ సమన్లు జారీ చేశారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వీరు సోషల్ మీడియాలో పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని..

  • Umakanth Rao
  • Publish Date - 5:52 pm, Wed, 18 November 20
సోషల్ మీడియాలో కామెంట్లు, కంగనా సిస్టర్స్ కి మళ్ళీ ముంబై పోలీసుల సమన్లు

కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీలకు ముంబై పోలీసులు మళ్ళీ సమన్లు జారీ చేశారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వీరు సోషల్ మీడియాలో పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ నెల 23 న కంగనా,  ఆ మరుసటి రోజున రంగోలీని పోలీసులు విచారించనున్నారు. అయితే తమ కుటుంబంలో ఎవరి పెళ్ళో ఉందని, తాను ఈ నెల 15 తరువాత  అందుబాటులో ఉంటానని కంగనా తెలిపింది. వీరు సోషల్ మీడియా ద్వారా, పోస్టుల ద్వారా మతపరమైన టెన్షన్లను రెచ్చగొడుతున్నారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సిస్టర్స్ కి పోలీసులు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి.