‘తలైవి’ కోసం కంగనా కసరత్తులు.. ఆ రెండింటిలో శిక్షణ

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో తలైవి ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ అమ్మ పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో జయలలిత పాత్రలో నటించేందుకు కంగనా రనౌత్ కసరత్తులు చేస్తోందట. అమ్మ పాత్ర కోసం తమిళం నేర్చుకుంటూ క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పొందుతుందట కంగనా. అలాగే జయలలిత […]

‘తలైవి’ కోసం కంగనా కసరత్తులు.. ఆ రెండింటిలో శిక్షణ
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 4:40 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో తలైవి ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ అమ్మ పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో జయలలిత పాత్రలో నటించేందుకు కంగనా రనౌత్ కసరత్తులు చేస్తోందట.

అమ్మ పాత్ర కోసం తమిళం నేర్చుకుంటూ క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పొందుతుందట కంగనా. అలాగే జయలలిత జీవిత చరిత్ర గురించి కూడా పలువురిని అడిగి తెలుసుకుంటోందట ఈ బాలీవుడ్ క్వీన్. కాగా ఈ మూవీకి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నాడు. మొదటి షెడ్యూల్‌ను మైసూర్‌ను, తరువాత షెడ్యూల్‌ను చైన్నెలో ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. అమ్మ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేాలా సన్నాహాలు జరుగుతున్నాయి.