వరల్ద్‌కప్‌లో విలియమ్సన్‌ సరికొత్త రికార్డ్!

ఐసీసీ వరల్ద్‌కప్ 2019లో భాగంగా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను(578) ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉండేది. 2007 ప్రపంచకప్‌లో మహేలా 11 ఇన్నింగ్‌ల్లో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలతో మొత్తం 548 పరుగులు సాధించాడు. తాజాగా కేన్‌ అతనిని దాటి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అతను రెండు శతకాలు సాధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *