బంగారంలా మారిన కనకంబరాల ధర..!! ఎంతంటే..?

మామూలుగా పూల రేటు ఒకటి ఉంటే.. పండగొస్తే.. మరో రేటు ఉంటుంది. ఎందుకంటే.. తక్కువనో.. ఎక్కువనో.. కొనుక్కుంటారని రేట్లు పెంచేస్తారు. తాజాగా.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా.. పూల రేట్లు.. వింటుంటే.. గుండె గుబేలమంటోంది. ఎలాగైనా.. పూలు కొంటారని.. పూల వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు. ఇప్పుడు 50 రూపాయలు పెడితే కానీ.. గుప్పెడు పూలు రావడం లేదు. కాగా.. అందులోనూ ఇప్పుడు బతుకమ్మ సీజన్‌ కూడా కావడంతో.. బంతి పూలు, చామంతి పూలకు ఒక్కసారిగా డిమాండ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:33 pm, Sun, 6 October 19

మామూలుగా పూల రేటు ఒకటి ఉంటే.. పండగొస్తే.. మరో రేటు ఉంటుంది. ఎందుకంటే.. తక్కువనో.. ఎక్కువనో.. కొనుక్కుంటారని రేట్లు పెంచేస్తారు. తాజాగా.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా.. పూల రేట్లు.. వింటుంటే.. గుండె గుబేలమంటోంది. ఎలాగైనా.. పూలు కొంటారని.. పూల వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు. ఇప్పుడు 50 రూపాయలు పెడితే కానీ.. గుప్పెడు పూలు రావడం లేదు.

కాగా.. అందులోనూ ఇప్పుడు బతుకమ్మ సీజన్‌ కూడా కావడంతో.. బంతి పూలు, చామంతి పూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కనకంబరాలు కిలో వెయ్యి రూపాలయ నుంచి 1500ల వరకూ పలుకుతోంది. ఎందుకంటే.. ఏపీలోని అనంతపురం జిల్లాలోని బత్తులపల్లిలోనే వీటి సాగు ఎక్కువగా ఉంటుంది. అలాగే.. చామంతులు కిలో రూ.800లుగా ఉంది మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ ధరలు చూసిన జనాలు షాక్‌ అవుతుంటే.. రైతులు మాత్రం లాభాలు వస్తున్నాయని సంబరపడుతున్నారు.