Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

వర్మ మరో కిరికిరి..కమ్మ రాజ్యంలో ట్రైలర్ రిలీజ్..

సంచలనాలు క్రియేట్ చేయడం అతనికి కొత్తేమి కాదు. అసలు రోజూ ఏదో ఓ వివాదం లేనిదే నిద్రపోను అనే టైపు. అలా లేనప్పుడు ఆయనే ఒక వివాదంగా మారతారు. పబ్లిసిటీ కోసం ఎంతైనా చేస్తాడు..ఏమైనా అంటే అందరూ బ్రతికేది పబ్లిసిటీ కోసమే..కానీ ఎవడూ బయటకు చెప్పుకోడు అని హితబోధ చేస్తాడు. కొంతమందేమో ఆయన మ్యూజియంలో ఉండాల్సిన అతి విలువైన వ్యక్తి అంటారు..మరికొందరు అడవిలో వదిలోసి జనావాసాల్లోకి రాకుండా చుట్టూ బారికేడ్లు పెట్టాలంటారు. అసలు ఏది అడవో, ఏది మ్యూజియమో తెలిసిన వ్యక్తి ఆర్జీవీ మాత్రమే అనేవాళ్లు కూడా లేకపోలేదు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఎన్నికల ముందు రాజకీయ ప్రకంపనలు రేపిన వర్శ..తాజాగా జగన్ సీఎం అయ్యాక ‘కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు’ సినిమాతో కొత్త వివాదానికి తెరతీశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చెప్పకనే చెప్తుంది. గతకొద్ది రోజులుగా సినిమాలోని వైఎస్ జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులను పోస్టర్లను రిలీజ్ చేస్తూ మూవీపై ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు. తాజాగా ట్రైలర్ మూవీ లవర్స్‌తో వావ్ అనిపించాడు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. కమ్మ సామాజికవర్గం అధిపత్యంలో ఉండే విజయవాడ ప్రాంతంలో రెడ్లు పాగా వేశారని వర్మ చూపించే ప్రయత్నం  చేశాడు. ట్రైలర్ మధ్యలో నారా లోకేశ్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి వారిని చూయించి…ఇందులో వాస్తవికత ఏ రేంజ్‌లో ఉండబోతుందో వెల్లడించాడు దర్శకుడు.  చివర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ తతంగం చూస్తున్నట్టు చూపించాడు. బ్రేకింగ్ న్యూస్ వర్మ వాయిస్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే పరిణామలకు తన ఊహాలను జోడించి ట్రైలర్ కట్ చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ పొలిటిషియన్స్, జర్నలిస్ట్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్స్, పోలీస్ పీపుల్ అండ్ కామన్ పీపుల్‌కి తన తరపున దివాళీ గిఫ్ట్ అని చెప్పాడు..  మొత్తనానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కావాల్సినంద కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.