Kambala race: కంబ‌ళ పోటీల్లో మ‌రో ఉస్సేన్‌బోల్ట్‌.. నిషాంత్‌శెట్టి సరికొత్త రికార్డ్‌!

Kambala race: కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే.. ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును […]

Kambala race: కంబ‌ళ పోటీల్లో మ‌రో ఉస్సేన్‌బోల్ట్‌.. నిషాంత్‌శెట్టి సరికొత్త రికార్డ్‌!
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2020 | 2:34 PM

Kambala race: కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే.. ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును నిషాంత్ శెట్టి బద్దలు కొట్టాడు. కొద్ది రోజుల క్రితం కంబళ పోటీలో శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అంటే వేగం పరంగా 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తాడు. ఇది జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు కంటే 0.03 సెకన్లు తక్కువ. తాజాగా ఈ రెండు రికార్డులను నిషాంత్ అధిగమించాడు.

దక్షిణ కర్ణాటకలో ప్రతి ఏడాది కంబళ అనే సాంప్రదాయ పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తూ…వాటి వెనుక యజమాని  కూడా పరుగెడతాడు. అయితే గతంలో శ్రీనివాస గౌడను ఉసేన్‌ బోల్ట్‌తో పోలుస్తూ సామాజిక మాథ్యమాల వేదిక అభినందనలు వెల్లువెత్తాయి. ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖలు కూడా అతడికి బంగారు పతకం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దీంతో క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అతడికి ట్రయల్స్‌ నిర్వహించాల్సిందిగా సాయ్‌ కోచ్‌లను ఆదేశించారు. అయితే తాను ఇప్పుడే సాయ్‌ ట్రయల్స్‌కు హాజరుకాలేనని, దానికి కొంత సమయం కావాలని కోరనున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీనివాస గౌడను తన కార్యలయానికి పిలిపించి అతణ్ని శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతి అందించారు.

అయితే.. వాస్తవానికి ట్రాక్‌పై పరుగెత్తడంతో పోలిస్తే.. కంబాళ పోటీలో పరుగెత్తడం కాస్త సులువనే అభిప్రాయాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. బురద నీళ్లలో కంబాళ పోటీలు జరిగినప్పటికీ.. జాకీకి దున్నల నుంచి వేగం విషయంలో సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి.. ఆ వేగం జాకీలదిగా లెక్కించడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. దీంతో.. అసలు కంబాళ పోటీలో వేగం లెక్కింపు కోసం వాడుతున్న సాంకేతిక యంత్రాలపై అనుమానాలు నెలకొన్నాయి.

[svt-event date=”18/02/2020,4:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?