పౌరసత్వ సవరణ బిల్లుపై కమల్ కన్నెర్ర

జాతీయ పౌరసత్వ బిల్లును మార్చేందుకు బిల్లు తీసుకువచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. బిల్లు అవసరం లేదంటూ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగమే పౌరసత్వ బిల్లులో మార్పులు, చేర్పులు అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సవరణలు అవసరం లేని పౌరసత్వ చట్టాన్ని మార్చాలనుకోవడం మూర్ఖత్వంతో కూడుకున్న చర్యగా కమల్ హాసన్ […]

పౌరసత్వ సవరణ బిల్లుపై కమల్ కన్నెర్ర
Follow us

|

Updated on: Dec 11, 2019 | 5:30 PM

జాతీయ పౌరసత్వ బిల్లును మార్చేందుకు బిల్లు తీసుకువచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. బిల్లు అవసరం లేదంటూ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగమే పౌరసత్వ బిల్లులో మార్పులు, చేర్పులు అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

ఎలాంటి సవరణలు అవసరం లేని పౌరసత్వ చట్టాన్ని మార్చాలనుకోవడం మూర్ఖత్వంతో కూడుకున్న చర్యగా కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మొదట్నించి మోదీ సర్కార్‌ను గట్టిగా విమర్శిస్తున్న కమల్ హాసన్ తాజా పౌరసత్వ చట్టంలో సవరణలను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి రోగం లేని మనిషికి ఆపరేషన్ చేయడం ఎంత పెద్ద తప్పో.. ఎలాంటి సవరణలు అవసరం లేని పౌరసత్వ చట్టంతో చెలగాటమాడడం కూడా అంతే తప్పని కమల్ హాసన్ చెబుతున్నారు.

రాజ్యాంగంలో ఏమైనా లోపాలుంటే.. సవరణలు చేయడం తరచూ జరుగుతున్నదేనని, స్వతంత్ర భారత దేశంలో పలు మార్లు రాజ్యాంగాన్ని సవరించారని ఆయన అంటున్నారు. కానీ లోపాలే లేని పౌరసత్వ చట్టంలో మార్పులు చేయడం అనవసరమని కమల్ అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలుగచేస్తాయని అన్నారు.