మన కమలకు దక్కిన సమున్నత గౌరవం

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.. అగ్రరాజ్యంలో ఇలాంటి అవకాశం పొందిన తొలి శ్వేత జాతీయేతర మహిళ కమలా హారిసే! ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం కించిత్తు మనకూ గర్వకారణమే!

మన కమలకు దక్కిన సమున్నత గౌరవం
Follow us

|

Updated on: Aug 12, 2020 | 2:15 PM

నాకు ఇప్పటి వరకు లభించిన గౌరవ ప్రతిష్టలు ..ఈ భూమ్మీద ఉన్న విలువైన సంపదలు ఏవీ నాకు ఇష్టమైనవి కావు… శ్యామలా గోపాలన్‌ కూతురుగా చెప్పుకోవడమే నాకు చాలా చాలా ఇష్టం’ ఇది కాలిఫోర్నియా సెనేటర్‌ కమలా హారిస్‌ చేసిన వ్యాఖ్య.. ఈ ఒక్క వ్యాఖ్య చాలు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్పడానికి! ఆమె ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.. అగ్రరాజ్యంలో ఇలాంటి అవకాశం పొందిన తొలి శ్వేత జాతీయేతర మహిళ కమలా హారిసే! ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం కించిత్తు మనకూ గర్వకారణమే!

1964 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో పుట్టిన కమలా హారిస్‌ను మన అమ్మాయే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. కారణం కమలాహారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ పుట్టి పెరిగింది చెన్నైలోనే ! ఆమె న్యూట్రిషన్‌, ఎండోక్రినాలాజీలో రిసెర్చ్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు.. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పరిశోధనలు చేస్తున్న సమయంలో ఆమెకు జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం పరిణయం వరకూ వెళ్లింది.. అన్నట్టు కమల తాతగారు, శ్యామలాగోపాల్‌ తండ్రిగారు పీవీ గోపాలన్‌ స్వాతంత్ర్య సమరయోధుడు.. దౌత్యాధికారిగా కూడా ఆయన పని చేశారు. కమల అమ్మమ్మ కూడా ఆ కాలంలోనే మహిళలకు కుటుంబనియంత్రణ హక్కు ఉండాలంటూ గట్టిగా పోరాడారు.. కమల చిన్నప్పుడు చాలా సార్లు చెన్నైకు వచ్చారు.. గోపాలన్‌కు కమలంటే వల్లమాలిన ప్రేమ.. తాత ప్రభావం ఆమెపై పడటానికి ఇదో కారణం..

1986లో హోవార్డ్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌లలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న కమల ఆ తర్వాత హేస్టింగ్‌ కాలేజీ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా సంపాదించారు.. విద్యాభ్యాసం అయ్యాక డెమొక్రటిక్‌ పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగులు వేశారు.. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్‌ అటార్నీగా ఎన్నికై సంచలనం సృష్టించారు.. ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా కమలా హారిస్‌ చరిత్ర నెలకొల్పారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. కమలాహారిస్‌ను చాలా మంది మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పోలుస్తారు.. కమల తండ్రేమో ఆఫ్రికా సంతతికి చెందిన వ్యక్తి.. తల్లేమో ఆసియా సంతతికి చెందిన వారు.. రెండు ఖండాల సంస్కృతులు కమలకు ఒంటపట్టాయి.. అందుకే ఆమెను ఒబామాతో పోల్చేది! 2014లో డగ్లస్‌ ఎమ్‌ హోఫ్‌ను పెళ్లి చేసుకున్న కమలా హారిస్‌కు తల్లింటే ఎంతో ప్రేమ! అంతకు మించి గౌరవం.. తన ప్రతీ విజయంలో అమ్మ పాత్ర ఎంతో ఉందని వినమ్రంగా చెబుతారు కమల. నిజమే..! ఆ కాలంలోనే శ్యామల అనేక కట్టుబాట్లను అధిగమించారు.. 19 ఏళ్ల వయసులో పెద్ద చదువుల కోసం అమెరికాలో కాలు పెట్టిన శ్యామల ఆ తర్వాత బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కమలా హారిస్‌కు ఏడేళ్ల వయసు ఉన్నపుడే శ్యామల-హోఫ్‌ విడాకులు తీసుకున్నారు. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటూనే కమలతో పాటు ఆమె సోదరి మాయా బాధ్యతను మోశారు శ్యామల.. అక్కాచెల్లెళ్లిద్దరూ న్యాయశాస్ర్తంలో పట్టా పుచ్చుకున్నారంటే అది శ్యామల గొప్పతనమే! అందుకే తన తల్లిని కమల అంతగా ప్రేమించేది! అంతగా గౌరవించేది! రియల్‌ హీరోగా అభివర్ణించేది!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి పోటీ చేసేటప్పుడే కమలాహారిస్‌ మదిలో ఓ విజన్‌ను పెట్టుకున్నారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్‌ నుంచి ఫర్‌ ద పీపుల్‌ అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కూడా! అప్పుడే కమల విడుదల చేసిన ప్రచారపు వీడియోకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. సరే.. ఆర్ధిక కారణాల వల్ల అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలకు ఇప్పుడు సువర్ణ అవకాశం లభించింది.. ఎన్నికల్లో గెలిస్తే కమలా హారిస్‌ కొత్త చరిత్ర రాసినట్టే! ఎందుకంటే అమెరికా హిస్టరీలో ఇప్పటి వరకు మహిళలు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా పని చేయలేదు.. 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ పోటీపడిప్పటికీ పార్టీల ఓటమి కారణంగా వారి ఆశలు ఫలించలేదు.

కమలాహారిస్‌పై ట్రంప్‌ ఎంత కంపుగా మాట్లాడినా.. ఎన్ని తిట్లు తిట్టినా అవి ఆమెకు దీవెనలే అవుతాయి.. జాత్యహంకారమూ ప్లస్‌ పురుషాహంకారమూ కలగలిసిన ట్రంప్‌ నోటి వెంట మంచి మాటలు వస్తాయని ఎవరూ మాత్రం అనుకుంటారు..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..