మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంచలన నిర్ణయం

Kamal Nath offers resignation from post of Madhya Pradesh Congress committee president, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపినట్టు మధ్యప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపక్ బార్బరియా తెలిపారు.

కాగా, బీజేపీ కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటింది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా కమల్ నాథ్‌కి పగ్గాలు అప్పజెప్పింది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే జరిగిన మధ్యప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో మట్టికరించింది. 29 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 28 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుని పరాజయభారం మూటగట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *