మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లోకి సుప్రీం ఎంటర్.. రేపే బలపరీక్ష..!

మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభానికి శుక్రవారం తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే గత వారం రోజులుగా మధ్యప్రదేశ్‌ సర్కార్ సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. రెండు రోజులుగా సుప్రీం కోర్టులో అధికార, ప్రతిపక్షాలు న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టులో విచారణ హీటెక్కింది. అసెంబ్లీలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని కోర్టు విచారణ చేపట్టింది. బీజేపీ తరఫున […]

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లోకి సుప్రీం ఎంటర్.. రేపే బలపరీక్ష..!
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2020 | 6:27 PM

మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభానికి శుక్రవారం తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే గత వారం రోజులుగా మధ్యప్రదేశ్‌ సర్కార్ సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. రెండు రోజులుగా సుప్రీం కోర్టులో అధికార, ప్రతిపక్షాలు న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టులో విచారణ హీటెక్కింది. అసెంబ్లీలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని కోర్టు విచారణ చేపట్టింది. బీజేపీ తరఫున ముకుల్ రోహ్తగీ.. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలు వినిపించారు. కాగా.. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5.00 గంటల్లోగా కమల్ నాథ్ సర్కార్ బలపరీక్ష నిరూపించుకోవాలని.. వీడియో రికార్డింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరోవైపు కర్ణాటకలో ఉన్న 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కర్ణాటక, మధ్యప్రదేశ్ డీజీపీలకు కోర్టు ఆదేశించింది.