బీకేర్ ఫుల్.. ఎమ్మెల్యేలను జారనివ్వకండి…

Kamal Nath Asks Ministers To Look After MLAs To Prevent Poaching, బీకేర్ ఫుల్.. ఎమ్మెల్యేలను జారనివ్వకండి…

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అప్పుడే కష్టకాలం ఎదుర్కొంటోంది. మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. దీంతో అత్యల్ప మెజారీటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కమల్ నాథ్.. ప్రస్తుతం ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.

అసెంబ్లీలో కమల్ నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. అంతే కాదు.. ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలో ఉందంటూ గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. దీంతో ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆపరేషన్ కమల్‌లో చిక్కకుండా జాగ్రత్తపడాలని రాష్ట్ర మంత్రులకు కమల్ నాథ్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఐదుగురు ఎమ్మెల్యేలపై దృష్టి సారించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలను మంత్రులపైనే నెట్టేశారు. ఈ మేరకు ఆయన ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *