Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Indian2 Mishap: క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్..

చలనచిత్ర పరిశ్రమలో బుధవారం రాత్రి దుర్దినం అనే చెప్పాలి. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'భారతీయుడు-2 ' సినిమా షూటింగ్ సెట్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.
Indian2 Mishap: Three dead 10 injured as crane crashes in the set of Kamal Haasan's Indian 2, Indian2 Mishap: క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్..

Indian2 Mishap:చలనచిత్ర పరిశ్రమలో బుధవారం రాత్రి దుర్దినం అనే చెప్పాలి. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు-2 ‘ సినిమా షూటింగ్ సెట్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూనమల్లిలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ కోసం లైటింగ్ సెట్ చేస్తూ ఉండగా,   150 అడుగుల ఎత్తులో ఉన్న క్రేన్ ప్రమాదవశాత్తూ టెంట్‌పై పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు.  మృతులు.. ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్‌లుగా నిర్దారణ అయ్యింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గాయపడ్డవారిని దగ్గర్లోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..మృతదేహాలను రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఘటనపై స్పందించిన కమల్, లైకా ప్రొడక్షన్స్ :

ప్రమాదంపై ట్విట్టర్ ద్వారా కమల్‌హాసన్‌ స్పందించారు.  ఘటన తన మనసుని కలిచివేసిందని… ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబంలో ఒకరిగా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పిన కమల్,  తన బాధ కన్నా ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక ప్రమాదంపై ‘భారతీయుడు-2 ‘ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిరంతరం తపనపడే ముగ్గరు గొప్ప టెక్నిషియన్లు కొల్పోయినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ, చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.

Related Tags