ఇంట్లో తెలియకుండా ఆ పని చేశా.. కమల్ క్రేజీ కామెంట్స్!

లోకనాయకుడు కమల్ హాసన్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. తన తండ్రి కోరిక వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చి మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టానని వెల్లడించారు. గురువారం కమల్ తన 65వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి శ్రీనివాసన్ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాత్రంత్ర్య పోరాటంలో తన తండ్రి పాలు పంచుకున్నారని.. సరిగ్గా అలాంటి పోరాటం మళ్ళీ వస్తే […]

ఇంట్లో తెలియకుండా ఆ పని చేశా.. కమల్ క్రేజీ కామెంట్స్!
Follow us

|

Updated on: Nov 08, 2019 | 6:43 PM

లోకనాయకుడు కమల్ హాసన్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. తన తండ్రి కోరిక వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చి మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టానని వెల్లడించారు. గురువారం కమల్ తన 65వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి శ్రీనివాసన్ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వాత్రంత్ర్య పోరాటంలో తన తండ్రి పాలు పంచుకున్నారని.. సరిగ్గా అలాంటి పోరాటం మళ్ళీ వస్తే ఏమి చేస్తావు అంటూ తనని ప్రశ్నించినట్లు కమల్ హాసన్ వెల్లడించాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడటంతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప.. వేరే ఏ ఉద్దేశంతోనూ రాలేదని గుర్తు చేశాడు. అయితే తన కుటుంబంలో తండ్రికి తప్పితే.. వేరెవ్వరికి తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం నచ్చలేదని చెప్పారు.

తొలినాళ్లలో సెలూన్ షాప్‌లో పని చేశా…

కమల్ హాసన్ విద్యార్థుల కోసం ప్రతిభా ప్రోత్సాహ శిక్షణ కేంద్రం రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లకూడదనే ఉద్దేశంతో మరిన్ని శిక్షణా కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని.. తాను కూడా తొలినాళ్లలో సెలూన్ షాప్‌లో పని చేశానన్నారు. ఆ తర్వాత తాను ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలియడంతో ఆ షాప్ యజమాని తన గురించి ఇంట్లో చెప్పారన్నారు. దానితో ఆ ఉద్యోగం మానేయాల్సి వచ్చిందని కమల్ చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి కమల్ హాసన్‌తో పాటుగా శృతి హాసన్, అక్షర హాసన్, చారు హాసన్, నళిని తదితరులు పాల్గొన్నారు.