బలవంతంగా అమలుచేస్తే భాషోద్యమం తప్పదు

Kamal Haasan has warned the centre of protests bigger than those in 2017 for Jallikattu, బలవంతంగా అమలుచేస్తే భాషోద్యమం తప్పదు

హిందీ భాష దేశాన్ని ఐకమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందన్న అమిత్‌ షా వ్యాఖ్యలపై రాద్ధాంతం కొనసాగుతోంది. ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సినవసరం ఉందని..దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష హిందీ మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.

హిందీ దివస్‌ సందర్భంగా షా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమల్‌ హాసన్‌. ఒకే దేశం, ఒకే భాష  విధానం సరైంది కాదు. ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. జాతీయగీతం బెంగాలీలో ఉన్నా కవి అన్ని భాషలకు, సంస్కృతికి గౌరవం ఇచ్చారు. అందుకే అందరం ఆలపిస్తున్నాం. మా మాతృభాష ఎప్పటికీ తమిళంగానే ఉంటుంది. మా భాష జోలికొస్తే జల్లికట్టుకు మించి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

హిందీయేతర భాష మాట్లాడేవారిని దేశంలో రెండో తరగతి పౌరులుగా చేస్తున్నారని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. హిందీ భాషను బలవంతంగా అమలుచేయాలని చూస్తే భాషోద్యమం తప్పదన్నారు డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌. ఇక తమిళనాడులో అధికార ఎఐఏడీఎంకే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా షా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో హిందీ మాట్లాడుతున్నందున అన్ని చోట్లా అమలుచేయాలనుకుంటే గతంలో వచ్చిన వ్యతిరేకతనే మళ్లీ ఎదుర్కొనాల్సివస్తుందన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. అన్ని భాషలనూ సమానంగా చూడాలని అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *