మళ్లీ కెలికిన కమల్.. ఈసారి ఎంత వరకు వెళుతుందో..!

సినిమాల్లో అద్భుత నటనను ప్రదర్శించి లోకనాయకుడిగా మెప్పొందిన కమల్ హాసన్‌ బయట మాత్రం వివాదాస్పద వ్యక్తిగా పేరొందాడు. నేతలపై, సమాజంపై, విలువలపై, సంప్రదాయాలపై పలు వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. దీంతో ఆయనపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా ఆరిపోయిన మంటకు మళ్లీ ఆజ్యం పోశాడు ఈ హీరో కమ్ పొలిటికల్ లీడర్. దీంతో అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇటీవల హిందీ దివస్‌ను పురస్కరించుకొని కేంద్ర మంత్రి అమిత్ […]

మళ్లీ కెలికిన కమల్.. ఈసారి ఎంత వరకు వెళుతుందో..!
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 3:17 PM

సినిమాల్లో అద్భుత నటనను ప్రదర్శించి లోకనాయకుడిగా మెప్పొందిన కమల్ హాసన్‌ బయట మాత్రం వివాదాస్పద వ్యక్తిగా పేరొందాడు. నేతలపై, సమాజంపై, విలువలపై, సంప్రదాయాలపై పలు వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. దీంతో ఆయనపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా ఆరిపోయిన మంటకు మళ్లీ ఆజ్యం పోశాడు ఈ హీరో కమ్ పొలిటికల్ లీడర్. దీంతో అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి.

ఇటీవల హిందీ దివస్‌ను పురస్కరించుకొని కేంద్ర మంత్రి అమిత్ షా..  ‘‘మొత్తం దేశానికి ఒక భాష ఉండటం చాలా అవసరం. ఆ భాష అంతర్జాతీయంగా భారత గుర్తింపు కావాలి. నేడు దేశాన్ని ఐక్యం చేయగల ఒక భాష ఏదైనా ఉందంటే.. అది అత్యధికంగా మాట్లాడే భాష – హిందీయే’’ అని మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో చాలా రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది నేతలు ఖండించారు. ‘‘బలవంతంగా మాపై హిందీని రుద్దకండి. మా మాతృభాషను బ్రతికించుకోనివ్వండి అంటూ పలు పార్టీల నేతలు స్ట్రాంగ్‌గా అమిత్‌ షాకు తమ కౌంటర్ ఇచ్చారు. వారిలో కమల్ హాసన్ కూడా ఉన్నారు. దీంతో దిగొచ్చిన అమిత్ షా ఓ క్లారిటీని ఇచ్చారు. ‘‘హిందీని కేవలం ద్వితీయ భాషగానే నేర్చుకోవాలని మాత్రమే తాను చెప్పానని..దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏ భాషైనా మాతృభాష తర్వాతేనని స్పష్టం చేశారు. తన మాతృభాష కూడా హిందీ కాదని’’ ఆయన అన్నారు. దీంతో ఈ వివాదం కాస్త అప్పటికీ సమసిపోయింది.

ఇక ఇదంతా గడిచి 15 రోజులకు పైనే అయింది. అందరూ ఈ వివాదం గురించి మర్చిపోయారు. అయితే తాజాగా మరోసారి హిందీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు కమల్.  ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కమల్.. ‘‘తెలుగు, తమిళం, సంస్కృతంతో పోలీస్తే హిందీ భాష వయస్సు తక్కువే. డైపర్లు వేసుకున్న చిన్న పిల్లాడి లాంటిది ఆ భాష. ఏ భాషనైనా మనం రక్షించుకోవాలి. కానీ దాన్ని బలవంతంగా మరొకరి మీద రుద్దకూడదు’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి ఈ వివాదాన్ని కమల్ కెలికినట్లైంది. మరి ఈ వ్యాఖ్యల దుమారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం