హింట్ ఇచ్చిన కమలహాసన్?

భారతీయుడు 2 తప్ప మరో సినిమా చేయనని ఆ మధ్య అనౌన్స్ చేశాడు కమలహాసన్, ఇక పూర్తిగా పాలిటిక్స్‌కే లైఫ్‌ని అంకితం ఇస్తానని అన్నాడు. ఐతే ఇపుడు ఇంకో సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ పాటలు ఇస్తాడట. ఆ విషయాన్ని రెహమాన్, కమల్ ట్వీట్ చేశారు.

19 ఎళ్ల తరువాత రెహమాన్ కమల్ కాంబినేషన్‌లో వస్తోంది. తెనాలి అనే సినిమాకి రెహమాన్ సంగీతం అందించాడు. ఆ తరువాత కమల్ హాసన్‌కి, రెహమాన్‌కి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో ఇన్నేళ్లు వాళ్లిద్దరూ వర్క్ చేయలేదు.

కమల్ హాసన్ ఈ కొత్త సినిమా ప్రకటించడంతో భారతీయుడు 2 సినిమా పూర్తిగా అటకెక్కింది అర్థమవుతోంది. ఈ ఏడాది జనవరిలో భారతీయుడు 2 సినిమాని అట్టహాసంగా ప్రారంభించారు. శంకర్ డైరెక్షన్ లో కమలహాసన్ భారతీయుడిగా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటూ హడావుడి చేశారు. ఐతే ఇపుడు ఈ సినిమా ఆగిపోయింది.

శంకర్ కమల్ కాంబినేషన్లో దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ భారతీయుడు. ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి సీక్వెల్ గా శంకర్ భారతీయుడు 2 మొదలుపెట్టాడు. ఐతే శంకర్ ఇటీవల తీసిన 2.0 సినిమా దారుణ పరాజయం పాలు అయింది. పెట్టిన నిర్మాతకి తీవ్ర నష్టం వచ్చింది. దాంతో శంకర్ మరో భారీ సినిమా అంటే కంపెనీ మూసుకోవాల్సిందే అని నిర్మాతలు భయపడ్డారు. దాన్ని పక్కన పెట్టారు. ఇపుడు శంకర్ ఎవరితో సినిమా తీస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. తమిళ హీరో విజయ్ తో వెళ్తాడా? లేక వేరే ఏదైనా సినిమా ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి. 2.0, ఐ వంటి సినిమాల తరువాత శంకర్‌తో భారీ సినిమాలంటే నిర్మాతలు జంకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *