Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత!

Kalvakuntla Kavitha Shows Her Humanity, మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత!

ఆధునిక ప్రపంచంలో… సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వారి ఉదార స్వభావానికి నిదర్శనం. తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే…

ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఖరీదైన వైద్య చికిత్సను భరించే స్థితి లేకపోవడంతో పలువురి  సహాయాన్ని ఆర్థించారు. కానీ వారికి కావాల్సినంత ఆర్థిక సహాయం అందకపోవడంతో, మాజీ ఎంపీ కవితను సహాయం ఆర్థిస్తూ అక్క మమ్మల్ని ఆదుకోమంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. మంత్రి కేటీఆర్‌, కవితను సహయమందించాలని కోరారు. ‘కవిత అక్క.. మేము నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్లం. నిజామాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదంలో చెన్నోజి రాము తీవ్రంగా గాయపడ్డాడు. వాళ్లు ప్రస్తుతం హాస్పిటల్ ఖర్చులు భరించే స్థితిలో లేరు అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హైదరాబాద్ లోని బర్కత్‌పుర ఆస్పత్రిలో చేర్పించారు.

ట్విట్టర్‌లో పోస్టు చూసిన వెంటనే మాజీ ఎంపీ కవిత వేగంగా స్పందించారు. వెంటనే ఆమె నా కార్యాలయ సిబ్బందిని కలువండి. 040-23599999 ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించండి. మేము తగిన సహాయం.. మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. మీకు అంతా మేలు జరుగుతుంది అనే భరోసాను ఎంపీ కవిత అందించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.