లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

శుభతరుణం ఆసన్నమైంది. సరికొత్త అధ్యాయానికి వేళయ్యింది. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశ చరిత్రలోనే మైలురాయిగా ఖ్యాతిగాంచిన కాళేశ్వరం మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది.  ప్రాజెక్ట్ విశేషాలకు వస్తే.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల పరంపరలో మొట్టమొదటి ఘట్టం మేడిగడ్డ బ్యారేజీ. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరానికి దిగువన గోదావరిపై 1.63 కిలో మీటర్ల వెడల్పుతో 85 గేట్లతో నిర్మించిన భారీ బ్యారేజీ ఇది. ఈ బ్యారేజీ వద్దే నేడు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మహా ఘట్టానికి సీఎం జగన్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు.

ఉదయం 8.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ మేడిగడ్డ చేరుకున్నారు. 8.30 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. 10.30 నిమిషాలకు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం జాతికి అంకితం

కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు.

21/06/2019,11:30AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం

కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం

21/06/2019,11:25AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం

కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ తెలంగాణ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

21/06/2019,11:15AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

మహారాష్ట్ర సీఎంకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. దేవేంద్ర ఫడ్రవీస్‌కు జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో ఫడ్రవీస్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.

21/06/2019,10:40AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

ఏపీ సీఎంకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

21/06/2019,10:20AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

నేడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు ఇవాళ మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. మేడిగడ్డ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. జ్యోతిప్రజ్వలన చేసి హోమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహిస్తున్నారు.

21/06/2019,10:00AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

మేడిగడ్డకు చేరుకున్న ఏపీ సీఎం జగన్

21/06/2019,9:36AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా పలుచోట్ల పంప్‌హౌస్‌లు ప్రారంభం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు

21/06/2019,9:14AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

మేడిగడ్డ యాగశాలలో సీఎం కేసీఆర్ దంపతుల యాగం

21/06/2019,9:14AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

మేడిగడ్డకు చేరుకున్న సీఎం కేసీఆర్

21/06/2019,9:04AM
Kaleshwaram project inauguration live updates, లైవ్ అప్‌డేట్స్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

మేడిగడ్డకు బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

21/06/2019,8:42AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *