అక్కారం ఓపెన్ పంప్ హౌజ్ దాటిన గోదారమ్మ..

గోదారమ్మ మండు వేసవిలోనూ పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలు సిద్ధిపేట్ జిల్లాను పులకింపజేశాయి. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద నిర్వహించిన ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది. అక్కారం సర్జిపూల్‌ నుంచి మార్కుక్‌ సర్జిపూల్‌ వరకు నీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరిదశ అయిన కొండ పోచమ్మ ప్రాజక్టులోకి గోదారమ్మ రెండు మూడు రోజుల్లో చేరనుంది. 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లలో అధికారులు ఒక మోటర్‌ను మంగళవారం ప్రారంభించారు. కొండపోచమ్మ […]

అక్కారం ఓపెన్ పంప్ హౌజ్ దాటిన గోదారమ్మ..
Follow us

|

Updated on: May 19, 2020 | 8:05 PM

గోదారమ్మ మండు వేసవిలోనూ పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలు సిద్ధిపేట్ జిల్లాను పులకింపజేశాయి. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద నిర్వహించిన ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది. అక్కారం సర్జిపూల్‌ నుంచి మార్కుక్‌ సర్జిపూల్‌ వరకు నీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరిదశ అయిన కొండ పోచమ్మ ప్రాజక్టులోకి గోదారమ్మ రెండు మూడు రోజుల్లో చేరనుంది. 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లలో అధికారులు ఒక మోటర్‌ను మంగళవారం ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని తరలించేందుకు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ప్రతిపల్లె సస్యశ్యామలం కానుంది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంపై అధికారులు, స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు.