ప్రభాస్‌తో మూడోసారి కాజల్..?

హిట్ పెయిర్‌ మళ్లీ రిపీట్ కాబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్‌’లతో రెండు హిట్లను సొంతం చేసుకున్న ప్రభాస్, కాజల్ జోడీ మూడోసారి జతకట్టనుందట.

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమ కథలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం కాజల్‌ను సంప్రదించారట. కథ విన్న కాజల్ ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌తో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటలో కూడా కాజల్ మెరవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు పది సంవత్సరాల తరువాత ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు.

కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఓ సెట్‌లో ప్రధానపాత్రాధారులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ ఆగష్టు15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *