కాజల్.. ఒక నటి.. నిర్మాత.!

‘చందమామ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఎన్నో హిట్స్.. ఆ క్రమంలోనే ఎన్నో ప్లాప్స్ చవి చూసిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. తాజాగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న ఈమె త్వరలోనే సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుందట.       ‘అ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోందట కాజల్. కెఏ మూవీస్ బ్యానర్ మీద కాజల్ […]

కాజల్.. ఒక నటి.. నిర్మాత.!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:20 PM

‘చందమామ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఎన్నో హిట్స్.. ఆ క్రమంలోనే ఎన్నో ప్లాప్స్ చవి చూసిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. తాజాగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న ఈమె త్వరలోనే సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుందట.      

‘అ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోందట కాజల్. కెఏ మూవీస్ బ్యానర్ మీద కాజల్ అగర్వాల్ నిర్మించే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందట. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హీరో రాజశేఖర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఏది ఏమైనా కాజల్ నిర్మాణ రంగంలో కూడా సక్సెస్ సాధించాలని కోరుకుందాం.