Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

టాప్ దర్శకుడి భార్యను కాకా పడుతున్న చందమామ..?

Kajal selfie with director's wife, టాప్ దర్శకుడి భార్యను కాకా పడుతున్న చందమామ..?

లక్ష్మీ కల్యాణంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చందమామ కాజల్.. 12 సంవత్సరాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతేకాదు మొన్నటివరకు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కొత్త కొత్త హీరోయిన్లు రావడం, రెండేళ్లుగా పెద్ద విజయాలేవీ లేకపోవడంతో కాజల్ హవా కాస్త తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2, జాన్ అబ్రహాం ముంబయి సగలో, మంచు విష్ణు మోసగాళ్లు సినిమాల్లో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాల షూటింగ్‌లన్నీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేసింది కాజల్. అందులో దర్శకధీరుడు రాజమౌళి భార్యతో ఆమె సెల్ఫీలు తీసుకుంది.

ఇక దీనిపై ట్వీట్ పెడుతూ.. ‘‘ఫ్లైట్‌లో నాకు ఇష్టమైన వ్యక్తులు కలవడాన్ని ఇష్టపడుతుంటా. మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తుంటామో ఆ వ్యక్తులే తెలీకుండా మన పక్క సీట్లో కూర్చుంటే మన ఆనందాన్ని వివరించలేము. రమా మేడమ్‌తో ఎప్పుడు మాట్లాడినా అదొక గొప్ప అనుభూతి’’ అని కాజల్ ట్వీట్ చేసింది. అయితే సాధారణంగా సినిమాల్లో నటిస్తూ ఉండటం తప్ప.. ఎవ్వరితోనూ కాజల్ అంత ర్యాపోను మెయిన్‌టైన్ చేయదు. అలాంటిది రమా రాజమౌళితో ప్రత్యేకంగా ఫొటో తీసి పెట్టడంతో.. దర్శకుడి భార్యను కాజల్ కాకా పడుతోంది అన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చెర్రీతో అలియా , ఎన్టీఆర్‌తో ఒలివియా మొర్రోస్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపుగా 70శాతం పూర్తి అయ్యింది. ఇలాంటి సమయంలో రమా రాజమౌళిని కాజల్ ఎంత కాకా పట్టినా.. ఈ మూవీలో అవకాశం రావడం కష్టం. మరోవైపు ఇప్పటివరకు 11 చిత్రాలను(బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది) తెరకెక్కించిన రాజమౌళి.. ఒక్క అనుష్కను తప్ప మరో హీరోయిన్‌ను రిపీట్ చేయలేదు. ఇక రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడానికి చాలా సమయమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో భవిష్యత్‌లోనైనా కాజల్‌కు, రాజమౌళి రెండో అవకాశం ఇస్తారేమో చూడాలి.

 

Related Tags