పెళ్లిపై చందమామ క్లారిటీ..తెగ ఫీలయిపోతోన్న ఫ్యాన్స్

కాజల్ అగర్వాల్..చందమామ లాంట వన్నె తగ్గని అందంతో పుష్కర కాలంగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.  ప్రజంట్ ఈ మద్దుగుమ్మ తెలుగులో మంచి విష్ణు సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. ఈ మూవీలో తన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసింది. మరోవైపు తమిళ్‌‌‌లో కమల్ సరసన, హిందీలో జాన్ అబ్రహం పక్కన ఆడిపాడబోతుంది. అయితే కాజల్ విషయంలో గాసిప్స్ కూడా ఎక్కువే. డేటింగ్ విషయం పక్కన బెడితే అమ్మడిని పెళ్లి రూమర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నాయి.  […]

పెళ్లిపై చందమామ క్లారిటీ..తెగ ఫీలయిపోతోన్న ఫ్యాన్స్
Follow us

|

Updated on: Dec 14, 2019 | 2:38 PM

కాజల్ అగర్వాల్..చందమామ లాంట వన్నె తగ్గని అందంతో పుష్కర కాలంగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.  ప్రజంట్ ఈ మద్దుగుమ్మ తెలుగులో మంచి విష్ణు సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. ఈ మూవీలో తన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసింది. మరోవైపు తమిళ్‌‌‌లో కమల్ సరసన, హిందీలో జాన్ అబ్రహం పక్కన ఆడిపాడబోతుంది. అయితే కాజల్ విషయంలో గాసిప్స్ కూడా ఎక్కువే. డేటింగ్ విషయం పక్కన బెడితే అమ్మడిని పెళ్లి రూమర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నాయి.  దీంతో మ్యారేజ్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. త్వరలో పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది.  లక్ష్మి మంచు యొక్క  ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’  చాట్ షోలో కాజల్  ఓపెన్ అయ్యింది. 

గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో కాజల్ తాను పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన విషయం తెలిసిందే.  దీపికా,  ప్రియాంక వివాహం చేసుకోవడం చూసి, తాను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాని, కెరీర్ పీక్ టైంలో కరెక్ట్ కాదని ఆగినట్టు తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి  కాకుండా బయటి వ్యక్తినే  ముద్దుగుమ్మ పెళ్లాడనుకుంటుదట. ఫైనల్‌గా కాజల్ పెళ్లికి సిద్దమైపోవడంతో..అమ్మడి ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.