రబడా‌కు గాయం.. ఢిల్లీకి షాక్

దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడా వెన్ను నొప్పి కారణంతో ఐపీఎల్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. దీంతో చెన్నైతో జరిగిన లీగ్ మ్యాచ్ కు దూరమైన రబడా.. గాయం మరింత ఎక్కువ కావడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది తమ జట్టుకు ‘స్టార్ పెరఫార్మర్’గా మారుతాడని భావించిన ఢిల్లీకి దీంతో నిరాశే మిగిలింది. ఢిల్లీ జట్టు ఇప్పటికే ప్లే‌ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితులలో రబడా ఢిల్లీ జట్టుకు […]

రబడా‌కు గాయం.. ఢిల్లీకి షాక్
Follow us

|

Updated on: May 03, 2019 | 5:02 PM

దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడా వెన్ను నొప్పి కారణంతో ఐపీఎల్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. దీంతో చెన్నైతో జరిగిన లీగ్ మ్యాచ్ కు దూరమైన రబడా.. గాయం మరింత ఎక్కువ కావడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది తమ జట్టుకు ‘స్టార్ పెరఫార్మర్’గా మారుతాడని భావించిన ఢిల్లీకి దీంతో నిరాశే మిగిలింది. ఢిల్లీ జట్టు ఇప్పటికే ప్లే‌ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితులలో రబడా ఢిల్లీ జట్టుకు దూరమవడం వారికి పెద్ద లోటే అని చెప్పాలి. మరోవైపు భారీ ఆశలు పెట్టుకున్న స్టెయిన్ ఇప్పటికే గాయానికి గురయ్యాడు. ఇప్పుడు రబడా కూడా గాయపడితే పరిస్థితి ఏలా అని దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.